గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (17:16 IST)

కోవిడ్ పాజ‌టివ్‌తో మ‌న‌సునులోనిది బ‌య‌ట‌పెట్టిన‌ జ‌బ‌ర్‌ద‌స్త్ వ‌ర్ష‌

Varsha
క‌రోనా సెకండ్ వేవ్ సినీరంగంలోని న‌టీన‌టుల‌తోపాటు, టీవీ న‌టీన‌టుల‌కు కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష కూడా కరోనా బారిన పడింది. వెంట‌నే తాను ప్ర‌జ‌ల‌కు కొన్ని విష‌యాల‌ను చెప్పాల‌ని వీడియో పెట్టింది. ఆమె మాట‌ల్లో.. రెండు రోజుల‌నుంచి అంత లేదు. ఓకే ఒకే అనుకున్నాం. ఆరోగ్యం బాగోలేద‌ని కోవిడ్ టెస్ట్‌కు వ‌చ్చాను. పాజిటివ్ వ‌చ్చింది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఇక్కడ జరిగిందేది ఎవ్వరికీ తెలియదు.. చూస్తే భయపడతారు. చనిపోయిన వారిని అలా ప్యాక్ చేసి పడేస్తున్నారు. అది చూడగానే లైవ్‌లోకి వచ్చి చెప్పాలని అనుకున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. రోజు వేడి నీళ్లు తాగండి.. ఎన్ని జాగ్రత్తలు ఉంటే అన్ని తీసుకోండి’  అని వర్ష పేర్కొంది.
 
వ‌ర్ష జ‌బ‌ర్ ద‌స్త్‌లో పాల్గొన్నాక ఆమె న‌టిగా ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. లేటెస్ట్‌గా `ప్రేమ ఎంత మ‌ధురం` అనే సీరియ‌ల్‌లో న‌టిస్తోంది. శ్రీ‌రామ్ అందులో హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా. ఆ సీరియ‌ల్‌ను త‌మిళ సీరియ‌ల్‌కు మాతృక‌. అందులో వ‌ర్ష కీల‌క పాత్ర పోషిస్తోంది.