వాల్మీకి వ‌చ్చేస్తున్నాడు...

Valmeeki
శ్రీ| Last Modified బుధవారం, 14 ఆగస్టు 2019 (19:44 IST)
మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తమిళంలో ఆ మధ్య వచ్చిన జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అధర్వ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటున్న వ‌రుణ్ తేజ్ వాల్మీకి సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. డిఫరెంట్ లుక్‌తో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు.


మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో అధర్వ మురళి తొలిసారిగా ఈ సినిమాలో న‌టించాడు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. మ‌రి... ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :