శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (16:38 IST)

తల్లితో సహా ఆర్గాన్ డోనర్ గా విజయ్ దేవరకొండ నిర్ణయం

Vijay Devarakonda
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ  ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 14న నెహ్రు జయంతి సందర్భంగా పేస్ హాస్పిటల్ నిర్వహించిన కార్య క్రమంలో ఆయన  పాల్గొన్నారు. అక్కడ పిల్లలకు కొన్ని గిఫ్ట్స్ అందజేశారు. పేస్ హాస్పిటల్ తో తనకు ఉన్న సంబంధాన్ని ఈ విధంగా తెలిపారు. నాన్నగారికి తరచూ ఫీవర్ వస్తుండేది. ఆ టైములో గూగుల్ లో వెతికితే డాక్టర్ ఫణి పేరు కనిపించింది. ఆయనకు వివరాలు చేప్పాను. 
 
నేను ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో టైం లేకపోవడంతో రాత్రి నాన్న గారిని  తీసుకెళ్ళాను. గాళ్ బ్లాడర్ సర్జరీ చేసి బాగుచేసారు. వారి వల్లనే ఇప్పుడు మా నాన్న ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారని తెలిపాడు.
 
అందుకే వారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చానని విజయ్ చెప్పాడు. అలాగే వారితో మాట్లాడుతూ ఆర్గాన్ డొనేషన్(అవయవ దానం) కోసం తెలుసుకున్నానని. ఈ డోనార్స్ వల్ల ఎంతో మంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది  అందుకే నేను, మా అమ్మగారు  కూడా ఆర్గాన్స్ అన్నీ డొనేట్ చేసేసామని తెలిపారు. నా తర్వాత నా పార్ట్స్ వల్ల ఎవరో ఒకరు బ్రతకడం వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు.