ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (14:28 IST)

కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

chandrababu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రోడ్డు షోలు, బహిరంగ సభల నిర్వహణకు అనువుగా ప్రాంతాలను ఎంపిక చేశాయి. 
 
ఇందుకోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షోలో పాల్గొంటారు. 
 
ఆ తర్వాత కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. గురువారం పట్టణంలో రోడ్డు షో నిర్వహించి, మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్డు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 
 
రాత్రికి కర్నూలులో బస చేసి శుక్రవారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు  పర్యవేక్షించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.