శనివారం, 25 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: బుధవారం, 26 అక్టోబరు 2022 (11:13 IST)

బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞ‌నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సి.ఎం. అవుతాడ‌ని వుంద‌ట‌!

pawan kalajnyanam
pawan kalajnyanam
అంద‌రూ న‌మ్మే కాల‌జ్ఞ‌నం బ్ర‌హ్మంగారిది. ఆయ‌న చెప్పిన చాలా విష‌యాలు, వింత‌లు ఇప్ప‌టికీ జ‌రుగుతూనే వున్నాయి. విధ‌వ‌రాలు దేశాన్ని ఏలుతుంద‌ని ఎప్పుడో చెప్పిన ఆయ‌న మాట‌లు ఆ త‌ర్వాత ఇందిరాగాంధీ పీఠంపై ఏలింది. ఇలా తెల్ల‌కాకులు సంచ‌రించును, తిరుమ‌ల దేవ‌స్థానం కొన్నిరోజులు మూసివేయును.. అంటూ ర‌క‌ర‌కాలుగా ఆయ‌న మాట‌లు చెప్పిన‌వి నిజ‌మ‌య్యాయి. క‌రోనా కాలంలో చాలా రోజుల‌పాటు తిరుమల ద‌ర్శ‌నం నిలిపివేయ‌బ‌డింది.
 

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే, ఆంధ్ర‌రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కోసం పోరాటాలు చేస్తున్న జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి బ్ర‌హ్మంగారి కాలజ్ఞానంలో రాసి వుందంటూ ఇప్పుడు ప‌వ‌న్ అభిమానుల సంద‌డి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రమున ప‌వ‌నుడు వ‌చ్చెన‌య‌! రాజ వార‌స‌త్వం న‌శించున‌య‌! ప్ర‌జారాజ్యం విలసిల్లున‌య‌! అంటూ రాసివుంది. అది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో ప‌వ‌న్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
 

ఇటీవ‌ల ఆంధ్ర రాష్ట్రంలో జ‌రుగుతున్న పోక‌డ‌లు, వింత‌లు, విశేషాల‌ గురించి అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంను విశాఖకు మార్చే క్ర‌మంలో ఎంద‌రిపై ఎన్నో దాడులు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌ల్లో నిదానంగా తిరుగుబాటు ధోరణి క‌నిపిస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా ఇక‌పై వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంద‌ని కాలజ్ఞానం చెప్ప‌డం, అది ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం విశేషమే.