శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (08:38 IST)

సూపర్ స్టార్ కృష్ణ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : చంద్రబాబు

babu krishna
సూపర్ స్టార్ కృష్ణ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్నారు. కృష్ణ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాత హీరోగా, నట శేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా అభిమానులతో పిలిపించుకుంన్న సూపర్ స్టార్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని అన్నారు.
 
ఒక నటుడుగానే కాకుండా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసిగా నిర్మాతగా కృష్ణను చెప్పుకుంటారని చంద్రబాబు గుర్తుచేశారు. టాలీవుడ్ జేమ్స్‌బాండ్‌గా, విలక్షణ నటుడుగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధ నుంచి మహేష్ బాబు, ఆయన కుటుంబం త్వరగా కోలుకునే ధైర్యాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.