చైనాలో 40వేల థియేటర్లలో విజయ్ సేతుపతి మహారాజ చిత్రం విడుదల
విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రం విజయాన్ని సొంతంచేసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో భారీ విడుదలకు సిద్ధమైంది. అలీబాబా పిక్చర్స్‌తో కలిసి యి షి ఫిల్మ్స్ నవంబర్ 29న దాదాపు 40000 లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్‌లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.
నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా మారుతుంది. ఈ చిత్రాన్ని చైనాలో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ సినిమాను ఏకంగా 40 వేల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వారు ప్రణాళిక కూడా చేస్తున్నారు.