సంబంధిత వార్తలు
- ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది, అందుకే కలి సినిమా చేశాం : ప్రిన్స్
- ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం
- అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రం ప్రారంభం
- బచ్చల మల్లి నుంచి ఫోక్ మెలోడీ మా ఊరి జాతరలో రిలీజ్
- మా ఊరి జాతరలో బచ్చల మల్లి ఎం చేసాడు?
అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్
Allari Naresh
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల బెనిఫిట్ వుంటుంది కాబట్టి సినిమా థియేటర్లలోకి రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రిలీజ్ డేట్ పోస్టర్ నరేష్ రగ్గడ్ న్యూ లుక్‌లో అందరిద్రుష్టిని ఆకర్షించింది. చెదిరిన జుట్టు, గుబురు గడ్డంతో, సిగరెట్ తాగుతూ నరేష్ ఇంటెన్స్ అవతార్ అదిరిపోయింది.
ఫస్ట్ లుక్, బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక నెలలో సినిమా ప్రేక్షకులు ముందు వస్తుండటంతో మేకర్స్ నెక్స్ట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభిస్తారు.
అమృత అయ్యర్ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రానికి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కథ, మాటలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
