గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (21:58 IST)

డబ్బు కోసమే శ్రీరెడ్డి ఆ పని చేస్తుందా? విశాల్‌ను టార్గెట్ చేయడంలో మర్మమేంటి?

తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనుక జరుగుతున్న లైంగిక బాగోతంపై గళం విప్పి ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించిన నటి శ్రీరెడ్డి. ఈమె మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌, రాఘవ లారెన్స్‌లపై లైంగిక ఆరోపణలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బెదిరింపులు రావడంతో ఇపుడు చెన్నైకు మకాం మార్చింది. 
 
చెన్నపట్టణంలో హీరో విశాల్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. త్వరలోనే నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాల్‌‌తో పాటు ఆయన వర్గం సభ్యులు మళ్లీ పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి విశాల్‌ను టార్గెట్ చేయడం వెనుక మర్మమేమిటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 
 
నిజానికి నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్ కుమార్ ప్యానల్స్ మధ్య ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, తాజాగా, శ్రీరెడ్డి కూడా విమర్శలు మొదలెట్టింది. ఎటువంటి కారణాలు లేకుండానే, ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో విశాల్‌ను టార్గెట్ చేసుకుంది. ఆయనపై పలు రకాల విమర్శలు చేసింది. ఇటీవల కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి, ఇతర ప్రముఖ హీరోయిన్లపై విమర్శల దాడి చేయడం ద్వారా తిరిగి వార్తల్లోకి వచ్చింది.