శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 జులై 2019 (20:37 IST)

మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?

ఏకాంబరం- కండక్టర్ గారూ దిల్‌షుక్ నగర్‌కు రెండు టిక్కెట్లు ఇవ్వండి.
కండక్టర్- రెండు టిక్కెట్లు ఎవరెవరికి...
ఏకాంబరం- రెండు టిక్కెట్లు నాకే...
కండక్టర్- ఒకటి సరిపోతుంది కదా రెండు ఎందుకు?
ఏకాంబరం- ఒకటి పోతే, ఇంకొకటి ఉంటుంది కదా అని.
కండక్టర్- మరి, రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ఏకాంబరం- నాకు బస్ పాస్ ఉందిలెండి.