మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:36 IST)

స్నేహం కోసం అన్ లిమిటెడ్ హింస చేసే పిచ్చోడి కథే సలార్ సీజ్ ఫైర్ :ఫుల్ రివ్యూ

Sallar-prabhas
Sallar-prabhas
నటీనటులు: ప్రభాస్- పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, బాబి సింహ, గరుడ రామ్, ఝాన్సీ తదితరులు 
సాంకేతికత : ఛాయాగ్రహణం: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రుర్, నిర్మాతలు: విజయ్ కిరగంందూర్, కార్తీక్ గౌడ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ప్రశాంత్ నీల్ 
 
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసిన మ్యాజిక్ తో వివిధ నేపథ్యాలతో ఆ తరహా ఫార్మెట్ లో పలు సినిమా వస్తున్నాయి. అందులో వయొలెన్స్ ఎక్కువగా వుంటుంది. విజయ్ నటించిన సినిమాలుకానీ, కె.జి.ఎఫ్. కానీ, జైలర్, విక్రమ్ వంటి సినిమాల్లో అన్ లిమిటెండ్ హింస అనే వెండితెరపై రాజ్యమేలింది. కె.జి.ఎఫ్. తర్వాత మరింత హింసతో  దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన సినిమా సలార్. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ: 
ఊరికి దూరంగా వుండే ఓ బొగ్గుగనుల్లో చిన్నతనంలో పనిచేస్తాడు దేవ  (ప్రభాస్). అది ఖాన్సార్ నేర సామ్రాజ్యం. అధినేత జగపతిబాబు. ఆయన రెండో భార్య కొడుకు పృధ్వీరాజ్ తో దేవకు స్నేహం.ఆ స్నేహం ప్రాణం ఇచ్చేంత పిచ్చి గా మారుతుంది. దేవా  గొడ్డు కారం తిని పెరిగాడు. చిన్నతనంలో స్నేహితుడి అవమానికి ప్రతీకారం తీరుస్తాడు. అనంతరం దేవ తల్లి మానాన్ని పృథ్వి కాపాడతాడు. ఆ తర్వాత ఇద్దరినీ పారిపోమ్మని ప్రుద్వీ పంపేస్తాడు. అలా  అస్సాం బోర్డర్ లో బొగ్గు గనుల ప్రాంతానికి వెళ్ళి మెకానిక్ గా దేవ పనిచేస్తాడు. అక్కడి బానిస కుటుంబాల పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ గా దేవ తల్లి పనిచేస్తుంది.
 
ఆ తర్వాత కొన్నాళ్ళకు అమెరికా నుంచి వచ్చి శత్రువులకు టార్గెట్ గా మారిన ఆద్య (శృతిహాసన్)ను దేవ కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలోనే దేవా అత్యంత భయంకరమైన ఖాన్సార్ నేర సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు దేవ ఎవరు? ఖాన్సాన్ సామ్రాజ్యానికి దేవకు సంబంధం ఏమిటి? అని చూచాయిగా తెలియజేసిన కథే సీజ్ ఫైర్ సినిమా. పూర్తిగా దేవ ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సీక్వెల్ వరకు ఆగాల్సిందే.
 
సమీక్ష:
ఈ సినిమా చూస్తే మిశ్రమానుభూతి కలుగుతుంది. ఒకవైపు బాహుబలి, మరోవైపు కె.జి.ఎఫ్. మార్క్, ఇంలోవైపు ఛత్రపతి ఛాయలు కనిపిస్తాయి. వీటిని కలిపి దర్శకుడు చేసిన ప్రయోగమే సలార్. సినిమా కథేమిటి? అనేది శ్రుతిహాసన్ కు వచ్చిన ప్రశ్న ద్వారా దర్శకుడు తెలియజేస్తూ రివర్స్ స్క్రీన్ ప్లే వాడాడు. అయితే పొన్నియన్ సెల్వమ్ లా కన్ఫూజ్ స్టోరీ, కన్ ప్యూజ్ కలిగించే పాత్రల పేర్లు. ఇప్పటి జనరేషణ్ కు పెద్దగా తెలియని ఊరి పేర్లు వుండడంతో పగ ఈ స్థాయికి వెళుతుందో హింస ద్యారా చూపించాడు.  అందుకే కథను శ్రుతికి ఓ తమిళ నటుడు చెబుతుంటే.. ఆగు ఆగు. అంటూ.. మందు కొట్టాలనుందని.. తాగుతుంది. దాంతో ప్రేక్షకుడు ఫీలింగ్ కూడా అదే అన్నట్లుగా ఉంటుంది.
 
కొన్ని కథలు చదివితేనే భయమేస్తుంది. కొన్ని వింటేనే భయం, మరికొన్ని తలచుకుంటేనే భయం కల్పిస్తాయి. మూడో  కథే సలార్ అంటూ వివరణ కూడా ఇచ్చాడు.  బ్రిటీష్ కాలంకు ముందు గజనీ, ఘోరీ మహ్మద్ కాలంనాటి తెగల కథ దాదాపు వెయ్యి సంవత్సరాల నాడు కొన్ని తెగల మధ్య జరిగిన ఆటవిక దాడులు, నేరాలు,  అరాచకాలకు ఇప్పటి తరానికి ఎలా మిక్స్ చేసి చూపాడనేది ఈ సినిమా. ఈ సినిమాలో డ్యూయెట్లు వుండవు. బాహుబలిని చూడానే ప్రజలంతా పాడుకునే పాటలాంటి తరహాలో అమ్మాయికి అన్యాయంజరుగుతుంటే కాపాడేటప్పుడు ఓ నేపథ్యం గీతం మాత్రమే వుంటుంది.
 
పీఠం కోసం పగ, ప్రతీకాలు ఎలా వుంటాయో పరాకాష్టగా ఈ సినిమా వుంటుంది. శ్రియా రెడ్డి జగపతిబాబు కూతురుగా, ప్రుధ్వీ ఆమె సోదరుడిగా ప్రత్యర్థి బిడ్డగా ప్రభాస్ నటించాడు. ఈ తెగకు చెందిన బాబిసింహ కీర్తి రెడ్డి భర్తగా నటించాడు.
 
గేమ్ ఆఫ్ త్రోన్స్ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఖాన్సార్ పేరుగా ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచం కేజిఎఫ్'కు ఎక్స్టెన్షన్ లాగా అనిపిస్తుంది. కథలో గందరగోళం వల్ల కథను ఫాలో అవడమే పెద్ద పరీక్షగా మారి శ్రుతిహాసన్ లా మందు కొట్టాలనిపించేలా వుంటుంది.
 
అసలు సలార్ అంటే ఎవరంటే.. పర్షియాను పాలించిన ఓ రాజు కథ. అందులో రాజుకు అండగా వుండేవాడే సలార్. రాజు ఇతన్నే నమ్ముతాడు. అలా కథను దర్శకుడు మొదలుపెట్టి ఈ సినిమాను అన్ని భాషలకు చూపించే ప్రయత్నం చేశాడు. హీరో క్యారెక్టర్ లో తల్లి పై ప్రేమ, స్నేహితుడిపై మరింత ఎమోషన్స్ వుంటాయి. అయితే స్నేహితుడితో హీరో బంధం గొప్పగా అనిపించాలి అంటే ఆ స్నేహితుడి పాత్ర ప్రత్యేకంగా ఉండాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఒక స్పెషల్ ఆర్టిస్టును ఆ పాత్రకు తీసుకున్నారు కానీ క్యారెక్టర్ డిజైన్ మాత్రం సరిగా జరగలేదు. 
 
సలార్ ట్రైలర్ చూసి థియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులను ప్రశాంత్ నీల్ కొంత ఆశ్చర్య పరుస్తాడు. హీరో- తల్లి- హీరోయిన్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరీ డ్రమటిక్ గా.. అనిపిస్తాయి. హీరో తన బంధనాలు తెంచుకొని విలయానికి సిద్ధమయ్యాకే ప్రేక్షకుల్లోనూ ఊపు వస్తుంది.ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ నడిచే ద్వితీయార్థం అందులో దొరలు, కాపరుల మధ్య జరిగే కుర్చీ పోరాటం ఆ సెట్ బాహుబలిని తలపిస్తుంది. అందులో కిలికిలి భాష మాట్లాడే క్రూరత్వం కలిగిన తరహాలో సౌరంగ సైన్యంలోని తెగవాడే ఈ దేవ. ఇలా చెప్పి దర్శకుడు కథ ముగించాడు. అందుకే సాగే కథాకథనాలు, కథను అర్థం చేసుకోవడమే పెద్ద పరీక్షగా మారుతుంది. 
 
ఇవన్నీ తెలియాలంటే సలార్-2 లో చూడాల్సిందే. ఇందులో ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు. తన ఆహార్యం, తెగింపు, ఊచకోత కోయడం వంటివి ఫ్యాన్స్ ను అలరిస్తాయో చూడాలి. మాస్ కోణంలో ది బెస్ట్ ప్రశాంత్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ వావ్ అనిపిస్తాడు. ఝాన్సీ,  శ్రియా రెడ్డి కీలక పాత్రలో రాణించింది. 
 
సాంకేతిక వర్గం: రవి బస్రుర్ కేజిఎఫ్ స్టైల్ మ్యూజికే ఇందులోనూ కొనసాగించాడు. మొదట్లో కొత్తగా అనిపించిన తన బ్యాగ్రౌండ్ స్కోర్.. సలార్ కు వచ్చేసరికి ఒక రకమైన మొనాటనీ తెచ్చిపెట్టింది. భువన్ గౌడ ఛాయాగ్రహణం అలవాటైన శైలిలోనే సాగింది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఉత్తమ స్థాయిలోనే సాగాయి. సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది.  చివరగా, ఒకే కంచంలో శాఖాహారం, మాంసాహారం దండిగా వుంటే ఏది ఎంత తినాలనేది తినేవాడిపై ఆధారపడి వుంటుంది. ఈ సినిమా కూడా అంతే.
రేటింగ్: 2.75/5