1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 7 అక్టోబరు 2016 (17:14 IST)

సర్వభూపాల వాహనంపై శ్రీవారు...(Video)

నాల్గవ రోజు రాత్రి బ్రహ్మోత్సవంలో ఉభయదేవురలతో కలసి స్వామివారు సర్వభూపాలవాహనంపై దర్శనమిచ్చారు. సమస్త భూమండలాన్ని పరిపాలించే రాజులు, మహారాజులందరు తన దాసులే అన్నది తన భక్తులకు తెలిజేసేందుకే స్వామివారు సర్వభూపాలుడిగా కనిపిస్తాడు. అష్టదిక్పాలకులతో పాటు ప

నాల్గవ రోజు రాత్రి బ్రహ్మోత్సవంలో ఉభయదేవురలతో కలసి స్వామివారు సర్వభూపాలవాహనంపై దర్శనమిచ్చారు. సమస్త భూమండలాన్ని పరిపాలించే రాజులు, మహారాజులందరు తన దాసులే అన్నది తన భక్తులకు తెలిజేసేందుకే  స్వామివారు సర్వభూపాలుడిగా కనిపిస్తాడు. అష్టదిక్పాలకులతో పాటు ప్రజలను పాలించే రాజులు, సర్వభూపాలవాహనంపై కొలువుదీరిన శ్రీనివాసుడిని మోసుకెళ్తారని పురాణాలు పెర్కొంటున్నాయి. 
 
తనను భూజస్కాందాలపై మోస్తు, హృదయంలోనూ త్రికరణశుద్ధిగా స్వామివారిని స్మరిస్తూ తద్వారా ప్రజలను మెరుగైన సేవలను అందించాలంటూ రాజోత్తములను ఆదేశిస్తారని పురాణ ప్రాశస్త్యం. ఏడు అడుగులు కలిగిన బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనాన్ని సమరభూపాల వాహనమని కూడా పిలుస్తారు. సర్వభూపాల వాహనంలో స్వామివారు కాళియమర్థనం చేస్తున్న శ్రీకృష్ణస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.