మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 6 మే 2020 (21:33 IST)

లిక్కర్ కిక్కులో కాలనాగునే కాటేశాడు, ఆ తర్వాత?

లిక్కర్ కిక్కు తలకెక్కితే వెయ్యి ఏనుగుల బలం వస్తుందంటారు. ఎంత పిరికోడికైనా కొండను ఢీకొట్టే ధైర్యం వస్తుందంటారు. ఈ మాటలన్నీ నిజమో.. అబద్ధమో మద్యం తాగేవారు చెప్పాలే కానీ చిత్తూరు జిల్లా సరిహద్దులో ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు. దాన్ని కసితీరా నోటితో కొరికి కొరికి చంపేశాడు. చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్డర్లో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
 
40 రోజుల లాక్ డౌన్ విరామం తరువాత ఓ మందుబాబుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడకి చేరుకుని ఫుల్లుగా మందుకొట్టి అనంతరం తన బైక్ పైన బయలుదేరాడు. అయితే హఠాత్తుగా ఐదు అడుగుల పాము అతని మోటారు సైకిల్‌కు అడ్డంగా వచ్చింది. సడెన్ బ్రేక్ వేసి పామును చేత్తో పట్టుకుని అందరి ముందే నోటితో కొరికాడు. 
 
పాము చనిపోయేదాకా  వదల్లేదు. ఏదో సాధించిన వాడిలో చచ్చిపోయిన పామును మెడలో వేసుకున్నాడు. ఆ తరువాత బండిపై కూర్చుని మద్యం సేవించాడు. ఇక్కడ మనోడి అదృష్టంతో పాటు పాముకు దురదృష్టం వెంటాడి బతికి బట్టకట్టాడు కానీ ఏ మాత్రం అటుఇటూ అయ్యుంటే పరలోకానికి పొయ్యేవాడు.