మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:50 IST)

స్కూటర్ హెడ్ ల్యాంపులో పాము.. క్యానులోకి ఎలా వెళ్లిందంటే?

snake
పొదల్లో, పుట్టల్లో వుండే పాములు ప్రస్తుతం ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. అలా బైకులో దాక్కున్న పామును ఓ వ్యక్తి వాటర్ క్యానులోకి పంపాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం యాక్టివా హెడ్ ల్యాంప్‌లో ఉన్న పాముకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 
 
లాక్ డౌన్ వల్ల ఇంటి నుంచి ప్రజలు ఎక్కడికి పోలేని పరిస్థితి. దీంతో బైకులు పార్కింగ్ ఏరియాలోనే వుండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాములు మంచిగా బైక్‌లలోకి దూరి ప్రశాంతంగా నిద్రిస్తున్నాయి. తాజాగా నాగుపాము ఒకటి యాక్టివా డూమ్ ప్రాంతంలో దూరి ఉండగా, దానిని గమనించిన బైక్ ఓనర్ పాములని పట్టే నిపుణులకి సమాచారం అందిచారు. అతను దానిని తెలివిగా వాటర్ క్యాన్‌లోకి ప్రవేశించేలా చేశాడు. ఆ తర్వాత క్యాన్ మూత పెట్టేసాడు. పాముని బాటిల్‌లోకి పంపే దృశ్యాన్ని చూస్తున్న చుట్టు పక్కల ప్రజల భయంతో కేకలు వేశారు.
 
పాముని పట్టుకున్న నిపుణుడు దానిని అరణ్యంలో వదిలి వేసేందుకు ప్రయత్నించగా, దాని మూతికి ప్లాస్టిక్ క్యాప్ ఒకటి చుట్టుకు పోయింది. దీనిని ఎంతో తెలివిగా ఇద్దరు యువకులు తొలగించారు. వారి దాన్ని తొలగించడానికి అపారమైన ధైర్యాన్ని కనబరిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.