శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (09:21 IST)

ట్రాక్టర్ నడిపిందని అమ్మాయిని గ్రామం నుంచి వెలేశారు... ఎక్కడ?

tractor young woman
జార్ఖండ్ రాష్ట్రంలో ఇంకా వివక్ష పోలేదు. ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. కానీ, ఈ రాష్ట్రంలో మాత్రం అమ్మాయిలు వివిధ రకాలుగా రాణిస్తుంటే... అక్కడి గ్రాపం పంచాయతీ పెద్దలు వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యువతి ట్రాక్టర్ నడిపిందన్న కారణంతో గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా సమీపంలోని శివనాథ్‌పుర్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మంజు ఓరన్‌ అనే వ్యక్తి కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం చేస్తూ, జీవనం సాగిస్తుంది. ఓ పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి స్వయంగా పొలాన్ని దున్నుతోంది. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్‌ నడిపితే చెడు జరుగుతుందని.. దీని వల్ల గ్రామంలో కరవు కాటకాలు వస్తాయన్న మూఢ నమ్మకంతో వారిలో బలంగా నాటుకునిపోయింది. 
 
అందువల్ల తక్షణం ట్రాక్టర్ నడపడం, దుక్కి దున్నడం వంటి పనులు వెంటనే నిలిపివేయాలని ఆమెను హెచ్చరించారు. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. మంజు ఓరన్‌.. గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది. తాను అంగీకరించబోనని.. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.