శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (16:07 IST)

ట్రెండింగ్.. అనసూయ #Savitrammaగా మారిన వేళ.. (వీడియో)

జబర్దస్త్ యాంకర్, సినీతార అనసూయ ఓ ప్రకటనలో నటించింది. రంగస్థలం నుంచి నెటిజన్ల ట్రోల్‌కు దూరమైన అనసూయ మరోసారి చిక్కుకుంది. రంగస్థలం సినిమాకు ముందు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోల్ అయ్యే అనసూయ తాజాగా చందన యాడ్‌తో అలనాటి తార, మహానటి సావిత్రి పాత్రను ఇమిటేట్ చేసింది. ఈ యాడ్‌లో అనసూయ మాయాబజార్‌లోని సావిత్రిలా కనిపించింది. 
 
ఆహా నా పెళ్లంట.. అనే పాటలో సావిత్రి కనిపించినట్లు అనసూయ అచ్చం అదే గెటప్‌లో దర్శనమిచ్చింది. కానీ ఈ గెటప్ కొందరికి నచ్చలేదు. ఇటీవల కీర్తి సురేష్‌ని సావిత్రిలా చూసిన కళ్లతో అనసూయను చూడలేకపోతున్నామంటూ ఆమెపై కామెంట్స్ చేయడం మొదలెట్టారు. 
 
''సావిత్రిగారితో నీకు పోలికా?'' అంటూ ప్రశ్నిస్తున్నారు. సావిత్రమ్మను ఇలాంటి పనులకు ఉపయోగించవద్దంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఇంకేముంది.. అనసూయ సావిత్రిగా మారిన యాడ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.