సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (14:21 IST)

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం : ఏడుకు పెరిగిన మృతులు - బిపిన్ రావత్?

నీలగిరి జిల్లాలో ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్టు తేలింది. మరో ఏడుగురులో తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో కూడా ముగ్గురు పరిస్థితి తెలియాల్సి వుంది. వీరిలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియలేదు. అలాగే, ఈయన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన మిలిటరీ ట్రాన్స్‌పోర్టు హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది వరకు ప్రయాణించారు. వీరిలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. 
 
బుధవారం ఈ హెలికాఫ్టర్ కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన తర్వాత 12.40 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయితే, ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కాట్టేరి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ కాలిబూడిదైంది. అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ఉన్న ఆర్మీ అధికారుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ముఖ్యంగా, బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.
 
గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆర్మీ అధికారులు తప్పించుకున్నారా లేదా అనేది తెలియాల్సివుంది. 
 
ఇదిలావుంటే, ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ పరిస్థితి తెలియలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. అలాగే, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుటాహుటిన నీలగిరికి ఢిల్లీ నుంచి వస్తున్నారు.