బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (10:29 IST)

వెంటపడిన చిరుతపులి - నడింట్లో పడిన మచ్చల జింక.. ఎలా?

కరోనా లాక్డౌన్ పుణ్యామని వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లో క్రూర మృగాలు కూడా బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిరుతపులి ఓ జింకపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఈ జింక.. కాలికిపని చెప్పి.. అర్థరాత్రి ఓ నడి ఇట్లోకి దూరి తన ప్రాణాలను రక్షించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఆ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్ర, ముంబైలోని పోవాలి అనే మురికివాడలో ఓ మచ్చల జింక వెంట చిరుత పడింది. ఆ చిరుత నుంచి తప్పించుకునేందుకు దౌడు తీసింది. ఈ క్రమంలో ఒక ఇంటి పైకప్పుకు దూకిన క్రమంలో ఆ ఇంటి పెంకులు పగిలిపోవడంతో నడి ఇంట్లో పడిపోయింది. దీంతో ఆ చిరుత దాడి నుంచి మచ్చల జింక ప్రాణాలు తప్పించుకుంది.
 
అయితే, గాఢ నిద్రలో ఉన్న ఆ కటుంబ సభ్యులు ఉలికిపాటుకు గురయ్యారు. ఎందుకంటే.. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి ఓ జింక ఇంట్లోకి పడిపోయింది. దీంతో, పెద్ద శబ్దం రావడంతో ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు ఉలిక్కిపడి లేచి చూడగా, తమ ఇంట్లో జింక వుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
తర్వాత సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ జింకను పట్టుకుని తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలివేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్‌గా మారాయి. చిరుత పులి ఆచూకీ కోసం అటవీశాఖ, అగ్నిమాపకదళ శాఖ అధికారులు గాలిస్తున్నారు.