శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:07 IST)

ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. వైరల్

బాహుబలి-2 సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.."తప్పు చేశావు దేవసేనా.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తలా..'' అంటూ సైన్యాధిపతి తలను ఒక్క వేటుతో నరికేస్తాడు బాహుబలి. 
 
ఈ డైలాగ్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోని ఈ సీన్‌ను నెటిజన్లు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తేనే, మరోసారి ఇలాంటి ఘోరాలు జరగవని వారు వ్యాఖ్యానిస్తున్నారు.