అతడి ఒంట్లో కరెంట్ వుందా... తాకితే వెలుగుతున్న బల్బ్(Video)
మన ఇంట్లో బల్బ్ వెలగాలంటే పవర్ సప్లై ఉండాలి. ఫ్యాను తిరగాలంటే పవర్ కనెక్షన్ ఉండాలి. కానీ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరసన్న రామనగర్ లోని చాంద్ పాషా ఇంట్లో మాత్రం కరెంటు లేకుండానే బల్బులు వెలుగుతూ ఉంటాయి. మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.. చాంద్ పాషాకి కొడుకు సమీర్, కూతురు సానీయా వున్నారు.
వారం క్రితం ఇంట్లో ఉన్న బల్బు చెడిపోవడంతో కొత్త బల్బు కొనుకొచ్చి దానిని బిగించే సందర్భంలో కొడుకు సమీర్‌ను పట్టుకోమని ఇవ్వడంతో సమీర్ టచ్ చేయగానే విద్యుత్ బల్బు వెలిగింది. ఆశ్చర్యపోయిన తండ్రి కుమార్తెకు సైతం పట్టుకోమని ఇవ్వడంతో బల్బు వెలిగింది. టచ్ చేస్తేనే కాదు ఆ పిల్లల మొహం మీద పెట్టినా, బుగ్గ మీద పెట్టినా... ఇలా శరీరం పైన ఎక్కడ పెట్టినా కూడా బల్బులు వెలుగుతున్నాయి.
దీంతో ఆశ్చర్యపోయిన తండ్రి చుట్టుప్రక్కల వారికి సమాచారం అందించాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామస్తులకు తెలియడంతో ఈ వింతను చూడడానికి చాంద్ పాషా ఇంటికి క్యూ కడుతున్నారు ప్రజలు.. మీరు చూడండి.