శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (15:23 IST)

హైదరాబాద్ ఫార్మసీ విద్యార్థిని రేప్ నాటకం, ఎందుకంటే?

హైదరాబాద్ శివారు ప్రాంతం లోని ఘట్‌కేసర్ సమీపంలో విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం జరిగిందంటూ పెట్టిన కేసును తప్పుడు కేసు అని తేలింది. విద్యార్థిని తన తల్లికి భయపడే ఆటోడ్రైవర్ తనపై అత్యాచారం చేసాడంటూ ఆరోపించిందని తేలింది. ఆమె చెప్పిన మాటల ప్రకారం పోలీసులు సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం వెళితే, ఆమె చెప్పిన దానికి అక్కడి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా వుంది.
 
ఆమె చెప్పిన టైంలో ఆటోడ్రైవర్ల్ అసలా ప్రాంతంలోనే లేరు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ వేరే ప్రాంతంలో వున్నాయి. పైగా సదరు విద్యార్థిని 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఏడున్నర వరకూ ఘట్ కేసర్, యంనంపేట్, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగా సంచరినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసుల అదుపులోనే ఆటో డ్రైవర్లున్నారు.
 
 చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదంటూ తల్లి పదేపదే ఫోన్ చేస్తూ వుండటంతో తనను ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకుని వెళ్లాడంటూ చెప్పినట్లు యువతి అంగీకరించింది. ఇంట్లో కుటుంబ సమస్యల కారణంగా ఎక్కడికైనా పారిపోవాలని యువతి ప్రయత్నించినట్లు తేలింది. సీసీ ఫుటేజ్ పరిశీలించాక ఆమె చెప్పినవన్నీ అవాస్తవాలని తేలాయి.