శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (10:56 IST)

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

Pawan kalyan
ఓటమి గురించి పాఠాలు నేర్చుకుని నేను ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ వుంటానని చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నేను రెండుసార్లు భగంవతుడిని కోర్కెలు కోరాను. మొదటిసారి మా అభిమానుల్లో ఒకరు మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని... అన్నా ఒక్క సినిమా హిట్ ఇవ్వని అడిగాడు. అప్పుడు మొదటిసారిగా భగవంతుడిని కోరుకున్నా. నాకోసం కాదు కానీ నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని, నా అభిమానుల ప్రేమతో చచ్చిపోతున్నాను అని అడిగాను. ఆ తర్వాత హిట్ కొట్టాము.
 
రెండోసారి... భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూసినప్పుడు మనోళ్లందరూ ఆ ఓటమితో నలిగిపోతున్నారు. అందుకోసం రెండోసారి భగంవతుడిని ప్రార్థించాను. అందుకే పిఠాపురం దత్తాత్రేయుడు పిలిచాడు" అంటూ చెప్పారు. చూడండి ఈ వీడియోను...