పంద్రాగస్టు రోజున పబ్లిక్ సెలవు రద్దు.. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 17 జులై 2022 (16:40 IST)
సాధారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైన పంద్రాగస్టు రోజున పబ్లిక్ హాలిడే. ఇపుడు ఈ హాలిడేను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని పంద్రాగస్టు రోజున ఇచ్చే పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 
 
ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్క విద్యార్థి విద్యా సంస్థల్లో ఉండాలని, అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశించారు. అయితే, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 
 
ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజున ఎప్పటి లాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments