గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:02 IST)

పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్.. తెదేపా సీనియర్లకు గాలం?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలను బాగా ఔపోషణ పట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఆయన తన పార్టీ బలోపేతానికి నడుంబిగించారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన నేతలను తన దరికి చేర్చుకునేందుకు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలను బాగా ఔపోషణ పట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఆయన తన పార్టీ బలోపేతానికి నడుంబిగించారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన నేతలను తన దరికి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఆయన ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలకు గాలం వేస్తున్నారా? ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌కి ప్రయత్నాలు మొదలుపెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీ సీనియర్ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. 
 
కొన్ని నెలల క్రితం జనసేన తరపున పవన్ కల్యాణ్ దూతలు తన వద్దకు వచ్చి పార్టీ మారమని బలవంత పెట్టారని జేసీ చెప్పుకొచ్చారు. కానీ వారి ఆఫర్‌ను తాను తోసిపుచ్చానని వెల్లడించారు. అదేసమయంలో తమకు ప్రత్యేక హోదాపై పెద్దగా పట్టింపులేదని, దానికి సమానమైన నిధులిచ్చినా ప్రజలను ఒప్పిస్తానని చెప్పారు.