సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:50 IST)

ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అగ్రస్థానం - ఢిల్లీలో మహిళలకు రక్షణ శూన్యం

ncrt report
దేశంలోని రాష్ట్రాల్లో ఆత్మహత్య కేసులు అత్యధికంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలవన్మరణాలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. గత 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల సంఖ్య 1,64,033గా ఉందని జాతీయ నేర చిట్టాల వేదిక (ఎన్.సి.ఆర్.బి - నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలో ఆత్మహత్యకు గల కారణాలను కూడా వివరించింది.
 
వృత్తిపరమైన కారణాలు, ఒత్తిడి, అసంతృప్తి, ఒంటరితనం, దూషణలను తట్టుకోలేక పోవడం, హింసాత్మక ఘటనలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత రుగ్మతలు, మద్యపానానికి బానిసలు కావడం, ఆర్థిక నష్టాలు, దీర్ఘకాలిక వైరాగ్య స్థితికి చేరుకోవడం వంటి అనేక అంశాలు ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయని తెలిపింది. 
 
అంతకుముందుటేడాది అంటే 2020లో సంభవించిన ఆత్మహత్యలతో పోలిస్తే 2021లో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 7.2 శాతం ఎక్కువగా వుంది. ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లు, తక్కువగా ఉన్న రాష్ట్రం కర్నాటకలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. 
 
అలాగే, మహిళకు రక్షణ లేని నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగుళూరు నగరాలు ఉన్నట్టు ఎన్.సి.ఆర్.బి నివేదిక వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు ఘోరాల సంఖ్య 40 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది.