శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:50 IST)

కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు - దేశంలో 7కి చేరిన కేసులు

monkeypox
దేశంలో ఒకవైపు కరోనా వైరస్‌తో పాటు మరోవైపు మంకీపాక్స్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ రోజువారీ నమోదు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ మంకీపాక్స్ వైరస్ మాత్రం చాపకిందనీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుగుకు చేరింది. 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 27న కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన్ను మలప్పురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
 
కాగా, మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి త్రిశూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో అతనితో సంబంధాలు కలిగిన 20 మందిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.