1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 మే 2024 (12:26 IST)

ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక: జనసైనికులు ఇన్విటేషన్

Mudragada-pawan
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఇపుడా విషయాన్ని జనసైనికులు ఉటంకిస్తూ ఓ ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు. ఈ ఇన్విటేషన్ పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో ఇలా రాసారు.
 
ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక మీకోసం అని చెబుతూ... అందులో ''అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం. కాపు సోదరసోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం అండి. 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో.

ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక మీ ఉప్మాకాఫీలు మీరే తెచ్చుకోవాలండి'' అంటూ సెటైర్లు పేల్చారు.