Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధిలో వున్నా, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నా: కైలాసం నుంచి నిత్యానంద స్వామి

Written By సెల్వి
Updated: శనివారం, 14 మే 2022 (13:57 IST)
వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో నిత్యానంద రాసలీలల వీడియో తెగ వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
అయితే ఆ తర్వాత డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇలా రకరకాల కేసుల్లో కటకటాల్లోకి వెళ్లిన నిత్యానంద బయటకు వచ్చి భారత్ వదిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్‌కు పారిపోయాడు. 
 
అక్కడ ఏకంగా తన కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. ఈ నేపథ్యంలో నిత్యానంద స్వామి మరణించారని కొన్ని రోజులుగా పుకార్లు రావడంతో తాను చనిపోలేదని తెలిపాడు. 
 
చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ వార్తలపై నిత్యానంద స్వామి  క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో పోస్ట్ చేశాడు. 
 
"ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు" అని తెలిపారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments