శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (19:17 IST)

"రంగస్థలం" చిట్టిబాబు పుట్టినరోజు స్పెషల్... జిగేల్ రాణి Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27. చెర్రీ అభిమానులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నటించిన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27. చెర్రీ అభిమానులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. సమంత హీరోయిన్. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా వేయికనులతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. సినిమా శాటిలైట్ హక్కులు ఓ రేంజ్‌లో అమ్ముడుబోయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుబోయినట్లు సమాచారం. హిందీ శాటిలైట్ హక్కులు 10.50 కోట్లకు అమ్ముడైనట్టు చెప్తున్నారు. ఇలా విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ అమాంతం పెరిగిపోతున్న తరుణంలో విడుదలయ్యాక ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
 
ఈ చిత్రంలో రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ 'జబర్దస్త్' భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఓ బాలుడు ఈ హాట్ యాంకర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, అతని సెల్‌ఫోన్ లాక్కొని పగలగొట్టి, దుర్భాషలాడిన విషయం తెల్సిందే. దీనిపై ఆ బాలుడి తల్లి కూడా అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో పెను వివాదాస్పదమైంది.
 
ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు నెటిజెన్లు ఆమె వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. సదరు మహిళ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ అనసూయ చెప్పినప్పటికీ... నెటిజెన్ల దాడి కొనసాగింది. దీంతో, కొంతకాలం పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాను యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్‌ను అప్‌లోడ్ చేసింది. ట్విట్టర్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసిన అనసూయ... 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి, తమకుతోచిన విధంగా కామెట్స్ పెట్టేస్తున్నారు. 
 
కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ, 'అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసింది. ఫుల్‌గా ఈ పాత్ర చేస్తుందని నేను అనుకోలేదు. ఈ సినిమాలో రాణించడం, మెప్పించడమే కాకుండా పాత్రకు ఓ పర్పస్ ఉంది. వావ్.. ఇందుకోసమే అనసూయను సినిమాలో పెట్టారా? అనిపిస్తుంది. మంచి పాత్ర చేసి అనసూయ ఈ సినిమాలో రాణించారు' అంటూ కితాబిచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ సినిమా అన్ని విధాలుగా, అన్ని కోణాల్లోంచి కూడా అత్యద్భుతం అనిపించుకుంటుంది. రాబోయే రోజుల్లో అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అవార్డుల కోసమే సినిమాలు తీయరు.. కానీ ఈ సినిమా మాత్రం అవార్డులు సొంతం చేసుకుంటుంది. చిత్రంలోని అన్ని విభాగాలు అవార్డులు వస్తాయి. జాతీయస్థాయిలో ఈ సినిమాలు అవార్డు వస్తుందన్నా ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అవార్డులు రావాలి.. రాకపోతే సినిమాకు అన్యాయం జరిగినట్లే. ఈ ఏడాది ఈ సినిమా అత్యద్భుతమైంది కావాలని.. అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందించారు. జిగేల్ రాణి వీడియో...