శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (16:01 IST)

#RRR సరసన మరో R : విలన్‌గా ప్రముఖ హీరో.. ఎవరు?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే తదుపరి ప్రాజెక్టు వచ్చే అక్టోబరు నెలలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే తదుపరి ప్రాజెక్టు వచ్చే అక్టోబరు నెలలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును సిద్ధం చేశారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రంలో విలన్‌ ఎవరన్నదానిపై ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజమౌళి తన తదుపరి సినిమా కోసం హీరో రాజశేఖర్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి రాజశేఖర్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. ఇదే నిజమైతే '#RRR' సరసన మరో 'R' వచ్చి చేరే అవకాశం ఉంది. 
 
కాగా, గతంలో స్టార్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు, ఆ తర్వాత విలన్‌గా మారి ఫుల్‍బిజీ అయ్యారు. ఇక శ్రీకాంత్ కూడా అదే రూట్లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇపుడు హీరో రాజశేఖర్ కూడా విలన్ పాత్రలపై దృష్టి పెట్టారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధంగానే వున్నానంటూ 'గరుడవేగ' సినిమా సమయంలో ఆయన ప్రకటించారు. అందువల్లే రాజమౌళి ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం.