మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:26 IST)

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దకుమార్తె భాజపాలో, చిన్నకుమార్తె సినిమాల్లో...

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను ఒకప్పుడు గంధపు చెక్కల స్మగ్లింగ్ తో కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ 2004లో తమిళనాడు టాస్క్ ఫోర్స్ చేతుల్లో హతమయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయి విద్యారాణి భారతీయ జనతా పార్టీలో చేరారు.
 
చిన్న కుమార్తె విజయలక్ష్మి కూడా ఓ ప్రాంతీయ పార్టీలో చేరింది. ఐతే ఆమె మరో అవతారం కూడా ఎత్తుతోంది. సినిమాల్లో అరంగేట్రం చేస్తోంది. రాజశ్రీ దర్శకత్వంలో కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె తన తండ్రిలాగే భుజాన తుపాకీ పెట్టుకుని ఫస్ట్ లుక్‌లో కనిపించింది.
 
చూస్తుంటే ఈ చిత్రంలో ఆమె గంధపు చెక్కల స్మగ్లర్ సంబంధ పాత్రలో కనిపిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి... వీరప్పన్ సినీరంగంలో ఎలా ముందుకు వెళ్తుందో?