ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (16:10 IST)

స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలకపదవి

Veerappan daughter
గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది.  గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరప్పన్ కుమార్తె తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య గత ఫిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 
 
అయితే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో  వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టారు.