Daily Horoscope
✕

చాపకింద నీరులా తెలుగు నెటిజన్ల ప్రచారం ... కమలనాథులకు నిద్ర కరవు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణ

Written By pnr
Updated: శనివారం, 7 ఏప్రియల్ 2018 (12:28 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణాటకలోని తెలుగు ప్రజలు కూడా కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు 
 
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇపుడు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాదమే కర్ణాటకలో బీజేపీ కొంప ముంచేలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాని ప్రభావం ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారిపైనా ఉందని భావిస్తున్నారు. 
 
హోదా విషయంలో టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి టీడీపీ-బీజేపీల మధ్య ఉప్పూనిప్పూ అన్నట్లు రగులుతోంది. మే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఎక్కువ మందికి ఆంధ్రా మూలాలతో ఇంకా సంబంధాలున్నాయి. 
 
వచ్చే ఎన్నికల్లో వీరిని బీజేపీకి ఓటేయకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కదులుతున్నాయి. తెలుగుదేశం నాయకత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలేవీ లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా, సామాజికవర్గ సమావేశాల ద్వారా చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద ప్రత్యేక హోదా అంశం కమలనాథుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య

తర్వాతి కథనం
Show comments