శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (16:52 IST)

ట్విట్టర్‌ను పక్కనబెట్టేసిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన షేర్లు

elon musk
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను కైవసం చేసుకోవాలని భావించిన అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ ఇపుడు దాన్ని పక్కనబెట్టేశారు. దీంతో ట్విట్టర షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనుకున్న డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఈ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతున్నట్టు తెలిపారు. ట్విట్టర్ మొత్తం ఖాతాల్లో ఈ ఖాతాల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువగా ఉంటాయని ట్విట్టర్ చెబుతోంది. 
 
కానీ, ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలు అందించాలని ఎలాన్ మస్క్ డిమాడ్ చేస్తున్నారు. ఈ వివరాలు అందించేంత వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ట్విట్టర్ షేర్ల ధర 20 శాతం మేరకు పడిపోయింది.