శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన ... 28 యేళ్ల కోడలిని పెళ్లాడిన 70 యేళ్ల మామ

marriage
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత ఘటన ఒకటి జరిగింది. 70 యేళ్ల వయసులో ఉన్న మామ ఒకరు 28 యేళ్ల వయసు కలిగిన కోడలిని పెళ్లి చేసుకునారు. ఇది రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా ఛపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఈయనకు 12 యేళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం కాగా, అందరూ వివాహాలు చేసుకుని వేర్వేరుగా కాపురాలు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు చనిపోయాడు. దీంతో అతని భార్య పూజ ఒంటరిగా మారిపోయింది. 
 
ఆమె ఒంటరి తనాన్ని చూడలేక కైలాశ్ యాదవ్ ఇటీవలే తన కోడలిని పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోని ఓ ఆలయంలో జరిగిన ఈ విహానికి స్థానికులంతా వచ్చారు. వారందరి సమక్షంలో తన కోడలు పూజ నుదుట కైలాశ్ సింధూరం దిద్దాడు. ఆ తర్వాత వారిద్దరూ పూల మాలలు మార్చుకుని ఒక్కటయ్యారు.