శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:20 IST)

బలమైన వృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తున్నాం.. నిర్మలా సీతారామన్

2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత ఆమె ఆ బడ్జెట్‌ను విత్తమంత్రి నిర్లమా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ, 2022-02-01 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. 
 
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రాబోయే 25 ఏళ్ల వృద్ధికి పునాది వేసేందుకు ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్టు పేర్కొన్నారు. 
 
దాని ఆర్థిక ప్రభావం నుండి వేగంగా కోలుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి అని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఆమె అభివర్ణించారు.