గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:06 IST)

బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేసిన వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు వేశపెట్టనున్నారు. 
 
అయితే, ఈ దఫా కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతులను ఎర్ర బ్యాగ్‌లోని ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. అనంతరం లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా దృష్ట్యా ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం పేపర్‌లెస్‌గానే ఉంటుంది. 
 
ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వెళ్లారు. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇస్తారు. మరోవైపు బడ్జెట్‌కు సంబంధించిన ముద్రిత కాపీలను పరిమిత సంఖ్యలో పార్లమెంటుకు తీసుకొచ్చారు. వీటిని మీడియాతో సహా ఇతరులకు అందజేయనున్నారు.