శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (19:02 IST)

లవ్ లెటర్సెందుకురా పురాతన ప్రేమికుడా?

ప్రియురాలికి ప్రియుడు రాసే అక్షరాలు.. చెలికి వెండివెన్నెల అందాలు... ఆ ప్రేమాక్షరాలు మరువలేని, మరపురాని, మత్తెక్కించి, మైమరిపించి, మరో లోకంలో విహరింపజేసే ప్రేమలేఖలోని ప్రణయాక్షరాలు. 
 
రెండు మనసులు... అయినా భావనలు ఒకటే
రెండు హృదయాలు... అయినా ప్రేమాక్షరాల స్పందన ఒకటే
ఇలా ఇరు ప్రేమ స్పందనలను పొదివి పట్టుకుని తన హృదయంలో దాచుకుని ఇష్ట సఖుడు/సఖి ముందు ఆవిష్కరించే ఆ ప్రేమ లేఖలు... ఇప్పుడు ఉన్నాయా?
 
ఎన్నాళ్లు... ఎన్నేళ్లు గడిచినా చెరగని ముద్రలా, నిలువెత్తు సాక్ష్యంలా నిలిచిన ఆ ప్రణయ లేఖలు నేడూ ఊసులాడుకుంటున్నాయా...? 
ఇలా కవితాత్మక ధోరణితో ఓ ప్రేమలేఖ ప్రియుడు ప్రశ్నాస్త్రాలను సంధిస్తే...
 
లవ్ వాయిస్ మెయిళ్లుండగా... ప్రేమ లేఖలెందుకురా ప్రియుడా
"హలో లవ్" అంటూ సెల్ "సై" అంటుంటే... లవ్ లెటర్సెందుకురా పురాతన ప్రేమికుడా
నెట్ ఉందీ.. పబ్ ఉందీ... డిస్కో థెక్ ఉందీ... ఇవి చాలక.... ఇంకెందుకురా పాతబడిన ప్రేమ లేఖల గొడవ
 
ప్రేమలేఖలు పట్టుకుని "మై స్వీట్ మెమెరీస్" అంటే అది పాతచింతకాయ ప్రేమ పచ్చడి.
పబ్బుల్లో ఊసులాడుతూ మబ్బుల్లో విహరించడం నేటి ఆధునిక "లవ్" పద్ధతి
ఇంకా అడుగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...
 
అంతే !! ఆ పురాతన ప్రేమికుడు మళ్లీ మాట్లాడితే ఒట్టు. ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇక చాలే అని గప్‌చిప్. అంతే.