Festival Posters
✕

1-08-2019- గురువారం మీ రాశి ఫలితాలు..

Written By రామన్
Updated: గురువారం, 1 ఆగస్టు 2019 (11:38 IST)
మేషం: భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తడి పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మత్తులు చేపడతారు. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
మిథునం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది. 
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. నూతన పరిచయాలేర్పడతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది.
 
సింహం: కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతనటెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం. మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. స్త్రీలకు బంగారం, నూతన వస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. 
 
కన్య: వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
తుల: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ద తీసుకుంటారు. 
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. కష్టసమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు. ఒక భారం దించుకున్న తరువాతనే కొత్త పనులు చేపట్టటం మంచిది. 
 
మకరం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం: తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సాంఘీక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం: ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విబేధాలు తలెత్తుతాయి. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలుంటాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది.

అన్నీ చూడండి

భయపెడుతున్న మురసు తుఫాను - ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి జరుపుకోవచ్చు : సుప్రీంకోర్టు

మురసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: అధికారులకు సీఎం బాబు పిలుపు

మురసు తుఫాను ప్రభావం : రేపు బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

పెళ్లి చేసుకుని భర్త లండన్ జంప్, వరంగల్ భర్త ఇంటి ముందు భార్య ధర్నా

అన్నీ చూడండి

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..

టీటీడీ పాలక మండలి పదవీ కాలం ముగిసింది.. తదుపరి ఛైర్మన్ ఎవరు?

తర్వాతి కథనం
Show comments