శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 సెప్టెంబరు 2020 (22:22 IST)

ఇంట్లో కూరగాయ మొక్కలను ఎక్కడ పెంచాలో తెలుసా?

కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు. నైరుతి దిశలో రేగుచెట్టు, దానిమ్మ, సీతాఫలం వుండకూడదు.
 
వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు వుండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి వుండకూడదు. పడమర పనస, దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను ఇంటి ప్రహరీగోడ లోపల పెంచకూడదు.
 
తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి.
 
ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరాన తులసికోట కట్టకూడదు. ఈ దిశల్లో కుండీల్లో కూడా తులసిని పెట్టరాదు. ఇక ద్రాక్ష, బొప్పాయ, కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ, నారింజ, పనస, నిమ్మ, ములగ, సపోట, జామ ఇలా చాలా రకాల ఫల మొక్కలని ఇంటి ఆవరణ మొత్తంలో ఎక్కడన్నా పెంచవచ్చు. కానీ, ఉత్తర దిశలో ఖాళీ తప్పక వదలాలి.