Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి ఆ దిశలో దిబ్బలు, రాళ్ల గుట్టలు వుంటే?

Written By సిహెచ్
Updated: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (21:16 IST)
ఈశాన్యదిశయందు దిబ్బలు, పేడకుప్పలు, రాళ్ళ గుట్టలు మొదలైనవి కల్గియున్నట్లైతే సుఖహీనత, నీచప్రవర్తన, విరోధములు, ఆయుక్షీణములు సంభవించి దరిద్రులు కాగలరు. ఈశాన్యము మెరక కల్గియున్నను, పల్లముగానున్నను అందుపాకలు, పందిళ్లు ఇతర కట్టడములు, బరువులు కల్గియున్న - దరిద్రము, కీడు, భార్యలేక గృహయజమానురాలికి తీవ్ర అనారోగ్యము, పుత్రనష్టము సంభవింపగలదు.
 
ఈశాన్యమునందు బావియుండుట ఐశ్వర్యప్రదము. వర్షపు నీరు, వాడుకనీరు పోవు కాల్వలు, గోతులు, జలాశయములు యుండుట వలన వంశవృద్ధి కల్గి, ధనదాన్య సంపదలు వృద్ధినందగలవు. ఈశాన్యంలో నీళ్ళకుండీలు భూమట్టమునకు తక్కువగా నిర్మించుకొనవచ్చును. వాటర్‌టాంక్‌లు నిర్మింపరాదు. మరుగుదొడ్లు నిర్మించిన యెడల కుటుంబకలహములు, నష్టములు, సంతతికి కీడు కలుగ గలదు.
 
ఈశాన్యదిశయందు స్థలము పెరిగి పల్లముగా నుండుట వలన సర్వశుభములు ప్రాప్తించగలవు. ఈశాన్యస్థలమునకు ఈశాన్య మందు ఇతరుల స్థలములు ఈ స్థలమునకన్న మించియున్న యెడల ధననాశనము, వంశహాని సంభవింపగలదు.
 
ముఖ్యముగా స్థలమందుగానీ, గృహమందుగానీ, గదులలో గానీ ఈశాన్యమూలన ఏ విధములైన కట్టడములు నిర్మించుట ద్వారములుండుట, బరువులుండుట మొదలైనవి శాస్త్ర విరుద్ధము. ఈశాన్యమందు ఖాళీగా వుంచుట శ్రేయస్కరము. ఈశాన్యదిశ పల్లము కల్గియుండు నట్లు గృహనిర్మాణ మొనర్చినట్లైతే అఖండ ఐశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)

నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్‌లో ఉద్యోగం.. కానీ ఓనర్‌కు దగ్గరై అలా దొరికిపోయింది..?

నా భర్త చాలా మంచోడు, ఆమె మీద పడుతుంటే కమిటయ్యానంటున్నాడు: ఫోక్ డ్యాన్సర్ భార్య, వీడియో

టిక్కెట్లు పెంపుతో వచ్చే ఆదాయంలో 20 శాతం చెల్లించాలి : తెలంగాణ సర్కారు ఆదేశం

సొంత పార్టీ నేతలనే పట్టించుకోని వైఎస్ జగన్.. అప్పుడైతే ఓకే.. ఇప్పుడేమైంది?

అన్నీ చూడండి

వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?

19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments