గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 ఫిబ్రవరి 2020 (20:42 IST)

ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే శుభం... ఏంటవి?

ఆగ్నేయంలో ఎట్టిపరిస్థితులలోనూ బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లవుతుంది.
 
గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
 
ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది.
 
కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
 
ఇంటి సింహద్వారం గుడి లేదా చర్చి లేదా స్మశానానికి ఎదురుగా వుండరాదు.
 
రెండు ద్వారాలు ఎదురెదురుగా వున్నప్పుడు వాటి పారులు సరిపోయేటట్లు వుండవలెను.
 
సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు.
 
తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి.
 
రూమ్ సీలింగ్‌లో అయిదు కార్నర్‌లు వుండడం ఏమాత్రం మంచిది కాదు.
 
వాయువ్యం గెస్ట్‌రూమ్‌కి మంచిది.
 
ఈశాన్యంలో మెట్లు వుండరాదు.
 
మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కేవిధంగా వుండాలి.
 
మెట్లు బేసిసంఖ్యలో వుంటే మంచిది. కుడి పాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోర్‌ఫై కుడిపాదం మోపుతూ చేరుతారు.
 
నైరుతి మరియు ఈశాన్యాలలో కాలమ్స్ గుండ్రంగా వుండడం మంచిది కాదు.