కొవ్వును కరిగించే బ్లాక్ పెప్పర్ సూప్, ఎలా చేయాలి?
మిరియాలు. బ్లాక్ పెప్పర్ సూప్ అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనంతో పాటు బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాము. వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ముక్కలు చేసిన ఉల్లిపాయ, ముక్కలు చేసిన రెండు క్యారెట్లు. ఆరు కప్పుల కూరగాయల రసం, రుచికి తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి రుచికి తగినంత. ఎరుపు మిరియాలు రేకులు రుచికి తగినంత, తరిగిన పుదీనా ఆకుల పొడి.
ఒక పెద్ద పాత్రలో, వెన్న- ఆలివ్ నూనెను మధ్యస్థంగా స్టౌ మీద వేడి చేయాలి. ముక్కలు చేసిన ఉల్లిపాయ, క్యారెట్లు వేసి, కూరగాయలు మెత్తబడే వరకు 5 నిమిషాలు వేయించాలి. పాత్రలో ఆరు కప్పుల కూరగాయల రసం వేసి మరికాసేపు మరిగించాలి. స్టౌ వేడిని తగ్గిస్తూ సూప్ 10 నిమిషాలు పాటు ఉడికించాలి.
ఉప్పు, నల్ల మిరియాలు పొడి, ఎర్ర మిరియాలు రేకుల్ని వేయాలి. తరిగిన పుదీనా రేకుల్ని సూప్ పైన అలంకరించి వేడిగా తాగేవయవచ్చు.