సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (14:47 IST)

టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై...

చాలామంది మార్కెట్‌లో దొరికేవన్నీ తెగ కొనేస్తుంటారు. కానీ, వాటితో వంటలు మాత్రం అసలు చేయరు. ముఖ్యంగా చెప్పాలంటే క్యాప్సికమ్. వంట చేయడానికి ఇంట్లో కూరగాయలు లేవని మార్కెట్‌కి వెళ్ళి క్యాప్సికమ్ క్యాప్సికమ్ అని కొంటుంటారు. కానీ దాంతో ఏ వంట చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఇక క్యాప్సికాన్ని అలా వదిలేస్తారు. క్యాప్సికమ్ కొన్ని రోజుల తరువాత పాడై పోతుంది. మళ్లీ మళ్లీ పాడై పోయిందని బాధ.. ఇవన్నీ పక్కన పెట్టి క్యాప్సికమ్‌తో త్వరగా అయిపోయే వంట ఎలా చేయాలో చూద్దాం..
   
 
కావలసిన పదార్థాలు:
గ్రీన్ క్యాప్సికమ్ - 3
జీలకర్ర - 2 స్పూన్స్
కొబ్బరి తురుము - పావుకప్పు
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
కొత్తిమీర - పావుకప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
ఉల్లిపాయలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2 
 
తయారీ విధానం:
ముందుగా క్యాప్సికమ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి 2 నిమిషాల తరువాత క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి 10 నిమిషాల పాటు అలానే వేయించి ఆ తరువాత కారం, కొత్తమీర, కొబ్బరి తురుము వేసి 5 నిమిషాలు వేయించాలి. అంతే క్యాప్సికమ్ ఫ్రై రెడీ.