శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (12:15 IST)

చికెన్ ఖీమా రోటీ.. ఎలా చేయాలో చూద్దాం..?

పిల్లలకు చపాతీలంటే చాలా ఇష్టం. అందుకని ఒకేవిధంగా చేంజ్ లేకుండా మళ్లీమళ్లీ అదే వంటకాన్ని చేసివ్వడం అంతగా ఇష్టపడరు. వారికి నచ్చే విధంగా చికెన్ ఖీమా రోటీ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
రుమాలి పిండి - 70 గ్రా
చికెన్ - 150 గ్రా
అల్లం తరుగు - 5 గ్రా
ధనియాల పొడి - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 2
ఉప్పు - 10 గ్రా
గుడ్డు - 1
పెచ్‌దర్ మసాలా - 15 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా చికెన్ ఖీమాకు అల్లం తరుగు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత రుమాలి పిండి వత్తుకుని మధ్యలో చికెన్ ఖీమా పెట్టి చపాతీలా చేసుకోవాలి. అంచుల్ని గుడ్డు సొనతో తడిచేసి మూసేయాలి. ఇప్పుడు పెనంపై నూనె వేసి వేడయ్యాక చపాతీలను కాల్చుకోవాలి. అంతే... చికెన్ ఖీమా రోటీ రెడీ.