శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:35 IST)

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు ఆరగిస్తే...

జామపండ్లు మనకు సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా లభిస్తాయి. అవి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మంచి పోషకాలను అందిస్తాయి. గర్భిణీలు గర్భధారణ సమయంలో జామపండ్లను తీసుకుంటే, తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారు. శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది. జామపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున గర్భిణీ స్త్రీలు ఇవి తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
గర్భిణీ మహిళలు అధిక రక్తపోటు సమస్యకు గురవుతూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. పండిన జామపండ్లను తింటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా గర్భస్రావంకాకుండా ఉంటుంది. జామపండులో పిండం పెరుగుదలకు అవసరమయ్యే అత్యవసర పోషకాలు సమృద్ధిగా లబిస్తాయి. దాంతో పాటు తల్లికి సరిపడా పోషకాలు కూడా అందుతాయి. గర్భిణీ స్త్రీలు అజీర్తి సమస్యలకు గురి అవ్వడం సాధారణం. 
 
జామపండ్లు తింటే జీర్ణక్రియ మెరుగుపడటమేకాకుండా, కడుపులో మంట, వికారం, మలబద్దకం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. జామకాయలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో జమపండును తీసుకోవడం వలన శిశువు నాడీ వ్యవస్థ మరియు మెదడు అభివృద్ధి బాగా జరుగుతుంది. జామపండును తినడం వలన గర్భధారణ సమయంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. జామపండులో ఉండే ఐరన్ మరియు కాల్షియం గర్భిణులకు చాలా అవసరం. ఐరన్ శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.