గర్భం రావాలన్నా.. రాకుండా ఉండాలన్నా ఏం చెయ్యాలి?
సాధారణంగా వివాహమైన వారు గర్భం రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంతమందికి వివాహం అయిన తరువాత కూడా గర్భం రాదు. గర్భం రావడానికి ఆ సమయంలోనే శృంగారం చేయాలంటున్నారు వైద్య నిపుణులు. అసలు గర్భం వద్దు అనుకునేవారు శృంగారం ఎలాంటి సమయంలో చేయాలి. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చదవండి..
సాధారణంగా పురుష బీజం, మహిళల అండంతో ఫలదీకరణం చెందడంతో మహిళలు గర్భం దాలుస్తారు. అయితే శృంగారం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో భంగిమను చేస్తుంటారు. ఇక గర్భానికి భంగిమలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అయితే చాలామంది శృంగారంలో డైలీ పాల్గొంటే గర్భం వస్తుంది అనుకుంటుంటారు. అయితే అది తప్పట.
శృంగారంలో పాల్గొనే సమయంలో మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో, పురుషుల వీర్యం మహిళల వ్యక్తిగత భాగంలో ఎక్కువ సేపు ఉంటే గర్భం వస్తుందట. అయితే మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. కానీ పురుషులకు మాత్రం శుక్రకణాలు వేల సంఖ్యలో విడుదలవుతాయి. మామూలుగా మగవారి శరీరం నుంచి విడుదలయ్యేవి మహిళల శరీరంలో ఐదురోజులు ఉంటాయి.
కానీ మహిళల శరీరంలో విడుదలయ్యే అండం కేవలం ఐదు నుంచి ఏడు గంటల మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది. అలా ఫలదీకరణం చెందిన తరువాత పది గంటల్లో పిండం అనేది ఏర్పడుతుంది. మహిళలకు అండం విడుదలయ్యే నాలుగు రోజులు లేదా ఐదు రోజులు మందుగా శృంగారం చేయడం వల్ల గర్భాన్ని దాల్చవచ్చని చెపుతున్నారు.