సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (16:05 IST)

అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి...?

చలికాలంలో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటించండి. చర్మం పొడిబారినట్లైతే ముఖ్యంగా పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేసిన తరువాత ముఖాన్ని మర్దన చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే ముఖచర్మం అందంగా తయారవుతుంది.
 
1. కీరారసంలో స్పూన్ పాలు, కొద్దిగా చక్కెర కలిపి ముఖానికి పూతలా పట్టించాలి. ఆపై 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో మూడుసార్లు క్రమంగా చేసి చూడండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
2. స్పూన్ బంగాళాదుంప రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. దాంతో ముఖం మృదువుగా తయారవుతుంది.
 
3. స్పూన్ పాలలో స్పూన్ పసుపు కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
4. క్యాబేజీ ముక్కలను నీటిలో వేసి మరిగించుకోవాలి. ఆపై నీటిని వడగట్టి, ముక్కల్ని మాత్రం గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా వారం రోజులు చేయాలి. అంతే చాలు..
 
5. అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె స్పూన్ నిమ్మరసం కలిపి చర్మంపై రాసుకోవాలి. ఇలా చేసి చూడండి మీలో తేడా కనిపిస్తుంది.