శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By జె
Last Modified: మంగళవారం, 19 నవంబరు 2019 (20:43 IST)

ఊడిపోతున్న, చిట్లిన జుట్టుకు ఇంటి నుంచే చికిత్స, ఎలా?

చాలామందికి చిట్లిన వెంట్రుకలతో ఇబ్బందులు పడుతుంటారు. తల స్నానం చేసినప్పుడు జుట్టు ఊడిపడిపోతుంటుంది. పడిపోతున్న జుట్టుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఇంటి నుంచే గృహ చికిత్స పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
 
చిట్లిన వెంట్రుకలకు అరటిపండు ఆధారిత హెయిర్ ప్యాక్ సరైన గృ చికిత్సని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఎ, సి,ఇ సహజ నూనెలు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, జింక్, ఐరన్లు లభిస్తాయట. జుట్టు కుదుళ్లను మరమ్మత్తు చేసి వెంట్రుకల కండిషన్ ను మెరుగుపరుస్తాయట. 
 
వెంట్రుకల సహజ ఎలాస్టిటీని అరటిపండ్లు మెరుగుపరుస్తాయట. ఇదే క్రమంలో చిట్లిన వెంట్రుకల్ని కూడా సరిచేస్తాయట. జుట్టు మెరుపులీనుతూ కనిపించడానికి ఎదుగుదలను మెరుగుపరడానికి కూడా ఉపకరిస్తుందట.
 
ఒక అరటిపండు, మూడు టేబుల్ స్పూన్ లు పెరుగు, కొద్ది చుక్కలు రోజ్ వాటర్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని జుట్టుకు ప్యాక్ గా వేసుకోవాలట. ఒక గంట ఉంచుకుని వాష్ చేస్తే జుట్టు ఈడిపోకుండా గట్టిగా అందంగా కనిపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.