గోరింటాకు మరకలు పోవాలంటే..?
సాధారణంగా మహిళలు రాత్రివేళ అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.
అలానే, జేబు రుమాళ్ళపైన, టవల్స్ మీద పడే లిప్‌స్టిక్ మరకలు పోవాలంటే వాటిపై గ్లిజరిన్ రాసి కాసేపటి తర్వాత సబ్బుతో ఉతికితే మంచి ఫలితం ఉంటుంది. శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి.
దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్కను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది. విద్యార్థుల దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.